జై శ్రీకృష్ణ
కృష్ణుని గురించి :
శ్రీ కృష్ణ పరమాత్మ దేవాది దేవుడు . ఈ చరాచర సృష్టికర్హ .
త్రిమూర్తులను కూడా సృష్టించినది ఆయనే .
విశ్వరూపం చూసినట్లైతే శివుడు విష్ణువు చెరోకవైపు , బ్రహ్మ హృదయములో కనిపిస్తారు .
విష్ణుమూర్తి కృష్ణుని యొక్క ప్రధాన అంశ .
ముందుగా మా తల్లిదండ్రులైన శ్రీ పచ్చిగొళ్ళ వెంకట రత్నం , రంగవల్లి తాయారు గార్లకు , అలాగే మా తాతగారు , మామ్మ గారు ఐనా శ్రీ పచ్చిగోళ్ల సుబ్బారావు , అనంత రాజ్యలక్ష్మి గార్లకి , నా యొక్క ప్రతి గురువునకు
, ఆది గురువైన శ్రీ కృష్ణ పరమాత్మకు, నాకు భగవద్గీత చదవడం నేర్పించిన దుర్గా గారికి నా హృదయ పూర్వక ప్రణామములు .
శ్రీ కృష్ణుని ఆజ్ఞ తో , ఆయన దివ్య ఆశీసులతో "srikrishna.org" ను 18/12/2018 , "గీతా జయంతి" రోజున ప్రారంభించినాము .
ఈ సైట్ యొక్క ముఖ్య వుద్దేశం - ప్రతి ఒక్కరూ భగవద్గీత ను అర్ధవంతంగా నేర్చుకోవాలని . అందుకు గాను ప్రతీ శ్లోకము విడి విడిగా రికార్డు చేయబడినది . నేర్చుకోదలచిన శ్లోకము ఎన్నిసార్లు ఐనా వినవచ్చు .
సర్వే జానా సుఖినో భవంతు .
For any queries feel free to call : 9246410466 (Ravi Sankar Pachigolla)
జై శ్రీకృష్ణ
పచ్చిగోళ్ల సుబ్బారావు గారి గురించీ :
పచ్చిగోళ్ల సుబ్బారావు గారు సేగు కృష్ణ దాసు గారి శిష్యులు . ఆయన సలహా మేరకు సన్నిహితులతో కలిసి విజయవాడ పాత బస్తీ శేషయ్య వీధిలో శ్రీ కృష్ణ ప్రార్ధనా సంఘం (ప్రార్ధనా మందిరం) కట్టించారు .
వారి యొక్క సంకల్పం భగవద్గీత ప్రచారం .భగవద్గీత నేర్చుకొనడానికి ఒక ప్రదేశం . అదే ప్రార్ధనా సంఘం .
ఇక్కడ ప్రతీ రోజు ఉదయం , సాయంత్రం భక్తులు భక్తిగీతాల పారాయణ , ప్రతీ ఆదివారం సాయంత్రం గీతా పారాయణ , అలాగే ప్రతీ ఏకాదశికీ విష్ణు సహస్ర నామ పారాయణ , భగవద్గీత పారాయణ చేస్తారు .
ద్వాదశి రోజు ద్వాదశి భోజనాలు నిర్వహిస్తారు . ప్రతీ ఆదివారం సాధువులకు అన్నప్రసాదం పంచుతారు .