భగవద్గీత ప్రస్తుత శ్లోకం కేవలం మీకోసం
యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ । ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ॥ ౧౭-౧౦॥ తాత్పర్యం: ఎండిపోయిన/మాడిపోయిన ఆహారము, మురిగిపోయిన ఆహారము, కలుషితమైన మరియు అపరిశుద్ధ ఆహారము - తామసీ గుణము ప్రధానముగా ఉన్నవారికి ప్రియముగా ఉంటాయి. [అ:17 శ్లో:10]

శ్రీకృష్ణుని ప్రతిజ్ఞ

మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు . మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసిమే . (అ:18 శ్లో:65) తాత్పర్యం: నీవు నాయందు మనస్సును నిలుపుము , నా భక్తుడువు కమ్ము .నన్నే సేవింపుము .నాకు నమస్కరింపుము . ఇట్లు చేయుట వలన నన్ను చేరి మోక్షాన్ని పొందగలవు .ఇది నా ప్రతిజ్ఞా పూర్వకముగా నేను చెప్పుచున్న మాట .

ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం

ముందుగా మీకు శుభాకాంక్షలు . ఎందుకంటే వేల మందిలో ఒక్కరూ మాత్రమే పరమాత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు . అట్లా ప్రయత్నించువారిలో కూడా ఒక్కరు మాత్రమే మత్పరాయనుడై శ్రీ కృష్ణుని తత్వమును తెలుసుకుంటారు . ఈ విషయమును శ్రీ కృష్ణ భగవానుడు 7 వ ఆద్యాయము లోని 3 వ శ్లోకం లో చెబుతాడు. కనుక ప్రయత్న పూర్వకముగా భాగవద్గీతను నేర్చుకోవడానికి ఈ వెబ్సైట్ చూశారంటే , మీకు శ్రీ కృష్ణుని అనుగ్రహం కలిగినట్లే . ఇది సత్యం సత్యం సత్యం. శ్రీ కృష్ణ పరమాత్మ దేవాది దేవుడు . ఆది గురువు . ఈ చరాచర సృష్టికర్త . త్రిమూర్తులను కూడా ఆయనే సృష్టించాడు . విశ్వరూపాన్ని చూసినట్లైతే శివుడు , విష్ణువు చెరోకవైపు , బ్రహ్మ హృదయములో కనిపిస్తారు . విష్ణుమూర్తి కృష్ణుని యొక్క ప్రధాన అంశ . ఈ జగత్తు మొత్తానికి ఆయనే ఆది గురువు అందుకే "కృష్ణం వందే జగద్గురుం" అంటారు . ఆయనకు మించిన గురువు వేరెవరు లేరు . శ్రీ కృష్ణుడు స్వయముగా ఉపదేశించిన మహత్గ్రంధం

"భగవద్గీత"

కనుక మానవుడనే ప్రతి ఒక్కడూ భగవద్గీత ను అర్ధవంతంగా నేర్చుకోవాలి . అందుకు గాను సులువుగా నేర్చుకోవడానికి ప్రతీ శ్లోకము విడి విడిగా రికార్డు చేయబడినది . నేర్చుకోదలచిన శ్లోకము కొన్నిసార్లు వింటూ చదివితే ఖంటస్తం అవుతుంది . ఎలా చదవాలి అని తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి . నేర్చుకోవడం ప్రారంబించడానికి ఇక్కడ క్లిక్ చేయండి . శ్రీకృష్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ..